కోనాపురం గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని

NDL: అవుకు మండలం కోనాపురం గ్రామంలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మంగళవారం నాడు పర్యటించారు. వైసీపీ నాయకుడు ఉమ్మడి చిన్న కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.