మూసాపేట్‌లో దేశముదురు రీ రిలీజ్.. ఫ్యాన్స్ సందడి

HYD: పూరి జగన్నాథ్ మార్క్ మూవీ అల్లు అర్జున్, హన్సిక జంటగా నటించిన దేశముదురు 2007లో విడుదలై మంచి విజయం సాధించింది. శనివారం మేకర్స్ రీ రిలీజ్ చేశారు. మూసాపేట్ శ్రీరాములు థియేటర్‌లో అభిమానుల సందడి మధ్య షో స్టార్ట్ అయింది. బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్‌కు చేరుకుని సినిమాను చూస్తున్నారు.