'మా లక్ష్యం అదే..!'

ELR: జిల్లాలో 20,199 మంది మహిళలను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యమని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి వెల్లడించారు. నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులను చేసేందుకు నిర్వహించే 'ఉల్లాస్' కార్యక్రమంలో భాగంగా ఈనెల 20వ తేదీ వరకు సర్వే చేయాలని ఆమె ఆదేశించారు. నిరక్షరాస్యులకు మే 5 నుంచి సెప్టెంబరు 18వ తేదీ వరకు తరగతులు నిర్వహిస్తామన్నారు.