రెండో జోన్‌కు సాగునీటి విడుదల

రెండో జోన్‌కు సాగునీటి విడుదల

KMM: కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ నుంచి రెండో జోన్‌లో ఆయకట్టుకు శనివారం సాగునీరు విడుదల చేశారు. ఇటీవల వర్షాలు, వరదలతో ఎడమ కాల్వకు నీటిని నిలిపివేశారు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోపక్క సాగర్ నుంచి 753 క్యూసెక్కుల నీరు చేరుతుండగా రిజర్వాయర్ నీటి మట్టం 21.75 అడుగులకు చేరింది.