'చందనోత్సవం.. అందరూ స్లాట్‌ల ప్రకారం రావాలి'
VSP: ఈ నెల 20న జరగనున్న సింహాచలం వరాహలక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం ప్రభుత్వ నింబంధనల ప్రకారం నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ముందుగా అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు కుటుంబానికి దర్శనం కల్పిస్తామని, సుమారు 1.50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. అందరూ స్లాట్‌ల ప్రకారం రావాలన్నారు. క్యూలైన్లలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.