మహాలక్ష్మి ఆలయ ఛైర్మన్‌గా లక్ష్మీనరసింహరావు

మహాలక్ష్మి ఆలయ ఛైర్మన్‌గా లక్ష్మీనరసింహరావు

నెల్లూరు: నగరంలోని నవాబుపేట శ్రీశ్రీశ్రీ బలిజవారి మహాలక్ష్మీ అమ్మవారి ఆలయ నూతన ఛైర్మన్‌గా కొండేటి లక్ష్మీ నరసింహరావు ఎన్నికయ్యారు. 7వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి ఆధ్వర్యంలో కార్యదర్శిగా మణెమ్మ, కోశాధికారిగా యంట్రపాటి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారని ఆయన తెలిపారు. త్వరలో పూర్తిస్థాయి కార్యవర్గం ప్రకటిస్తామన్నారు.