'జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'
SKLM: గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్సీ జనసేన పార్టీ కార్యదర్శి నాగబాబు అన్నారు. శనివారం లావేరులోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బలంగా నిలబడి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.