గిరిజనులు పోడు నరకకుండా చూడాలి: కలెక్టర్
BDK: అటవీ భూముల పరిరక్షణను అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. అటవీ భూముల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. కలెక్టరేట్‌లో ఇవాళ DFO కృష్ణ గౌడ్, ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. గిరిజనులు పోడు నరకకుండా చూడటం అత్యవసరమని పేర్కొన్నారు.