VIDEO: కేన్ మొక్కలకు నిప్పు.. అరుదైన జీవవైవిధ్యానికి భారీ నష్టం
ములుగు జిల్లా పాలంపేటలో జీవవైవిధ్యానికి నిలయమైన కేన్ మొక్కలను సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో అరుదైన కేన్ మొక్కలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందగానే అటవీ శాఖ అధికారులు అగ్నిమాపక శాఖ సహాయంతో మంటలను ఆర్పివేశారు. భూమి అక్రమ ఆక్రమణ కోసమే నిప్పంటించినట్టు అనుమానంతో అధికారులు విచారణ చేపట్టారు.