విస్సన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NTR: విస్సన్నపేట రైతు సేవ కేంద్రం నందు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ అబ్బినేని చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకే రైతులు ధాన్యం విక్రయించవచ్చని అన్నారు. అనంతరం బాబు రైతులు వెంకటేశ్వరరావు, సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.