VIDEO: పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

VIDEO: పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

MNCL: హజీపూర్ మండలంలో గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు స్లిప్పులను పరిశీలించి లోపలికి అనుమతిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలో 12 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.