ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్ సమీక్ష
WGL: జిల్లావ్యాప్తంగా 240 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డా.సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 2025-26 రబీ సీజన్లో 2.10 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు.