మహిళ అదృశ్యం.. కేసు నమోదు

WNP: వనపర్తి పట్టణానికి చెందిన సాయిబాబా కుమార్తె చందన అదృశ్యమైనట్లు బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశామని పట్టణ SI హరిప్రసాద్ తెలిపారు. టైలర్‌గా జీవనం సాగిస్తున్న ఆమె సోమవారం మధ్యాహ్నం దుస్తులు కొనడానికి బయటికి వెళ్లి రాత్రి అయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో తల్లి మల్లీశ్వరి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.