స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సమావేశం

KRNL: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. రంజిత్ భాషా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వేడుకల ఏర్పాట్లపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఏటా చేసే కార్యక్రమైనప్పటికీ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.