అలిశెట్టి విగ్రహానికి ఘన నివాళి అర్పించిన MLA
జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్‌లో ఇవాళ అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్థంతి సందర్భంగా MLA డాక్టర్ సంజయ్ కుమార్ అలిశెట్టి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్‌గా చివరి వరకు సమాజం కోసమే తండ్లాడిన ప్రజాకళాకారుడు అని కొనియాడారు. పట్టణ నాయకులు పద్మశాలి సేవా సంఘం సభ్యులు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.