జీడిపప్పు పరిశ్రమకు ప్రసిద్ధి మన చీరాల
BPT: వస్త్రాలకే కాదు, జీడిపప్పు పరిశ్రమకు కూడా చీరాల ప్రసిద్ధి. ఇక్కడ వందలాది ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, ఏటా రూ.కోట్లాది వ్యాపారం జరుగుతోంది. ఇక్కడి జీడిపప్పు నాణ్యతకు పెట్టింది పేరు. ఈ పరిశ్రమలో అధికంగా మహిళలే ఉపాధి పొందుతున్నారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకే కాక, విదేశాలకు కూడా భారీగా సరఫరా అవుతుంది. తక్కువ సమయంలోనే ఈ ప్రాంతం జీడిపప్పు హబ్‌గా ఎదిగి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచింది.