పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
KNR: శంకరపట్నం మండలం కరీంపేట్ సర్పంచ్ శ్రీలత ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు (FMD) వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొత్తం 421 పశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది డా.మాధవరావు, సందీప్, అమర్ ఖాన్, సాయి కిరణ్, అజహర్, గోపాలమిత్రలు, శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.