గట్టు పోలీస్ స్టేషన్‌కు నూతన ఫింగర్ ప్రింట్ మిషన్

GDWL: గట్టు మండల పోలీస్ స్టేషన్‌కు గద్వాల జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి నూతన ఫింగర్ ప్రింట్ మిషన్ బహుమతిగా అందిందని ఎస్సై కేటి మల్లేష్ తెలిపారు. ఆయన మంగళవారం రిబ్బన్ కట్ చేసి ఈ మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఈ ఫింగర్ ప్రింట్ మిషన్ ద్వారా నేర చరిత్ర ఉన్న వ్యక్తులను సులభంగా గుర్తించవచ్చని తెలిపారు.