ఎరువుల దుకాణాలపై డీసీపీ ఆకస్మిక తనిఖీ

JN: బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను డీసీపీ రాజమహేంద్ర నాయక్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సై హమీద్, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి, లైసెన్సులు, నిల్వలు, అమ్మకాలు, ధరలను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందించాలని, కృత్రిమ కొరత సృష్టించొద్దని దుకాణ దారులను ఆయన హెచ్చరించారు.