పోలీసులకు BRS మాజీ ఎమ్మెల్యే వార్నింగ్

TG: నాగర్‌కర్నూల్ పోలీసులకు BRS మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుల మాటలు విని BRS కార్యకర్తలను వేధిస్తున్న ప్రతి ఎస్‌ఐ, సీఐ, డీఎస్‌పీల పేర్లు రాసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మర్రి జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు.