ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
విజయనగరంలో ఇవాళ టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొని NTR విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో టీడీపీని స్థాపించి దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.