'ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు'

'ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు'

KRNL: తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు సీఐ తేజమూర్తి హెచ్చరించారు. గస్తీ, నిఘా పటిష్ఠం చేసి పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారని తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేసినా, రవాణా చేసినా కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.