మహానేత వైఎస్ఆర్: ఎమ్మెల్యే

MBNR: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం దేవరకద్రలో నిర్వహించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎంగా రాష్ట్రాన్ని అత్యంత అభివృద్ధి పథంలో నడిపించి అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు.