25 నాటు తుపాకులు స్వాధీనం

25 నాటు తుపాకులు స్వాధీనం

చింతపల్లి: చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో గిరిజనులు వేటకు ఉపయోగించే 25 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఎవరైనా నాటు తుపాకులు కలిగి ఉంటే పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి స్వచ్ఛందంగా అప్పగించాలని సూచించారు. కూంబింగ్ నిర్వహణలో పోలీసులకు తుపాకులతో ఎవరు కనపడ్డ పదేళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.