'స్థానిక సంస్థల ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలి'
AKP: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ సూర్యచంద్ర అన్నారు. గొలుగొండలో గురువారం జనసైనికులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకం కావాలన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పతకాలను ప్రజలకు అర్ధం అయ్యేలా వివరించాలన్నారు.