'విదేశాల్లో పైనాపిల్‌కు మంచి గిరాకీ ఉంది'

'విదేశాల్లో పైనాపిల్‌కు మంచి గిరాకీ ఉంది'

మన్యం: పైనాపిల్ పార్కుకు జిల్లా అనుకూలమని ఆ దిశగా ఆలోచనలు చేయాలని మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్ భారత్ అధికారులను ఆదేశించారు. విదేశాల్లో పైనాపిల్‌కు మంచి గిరాకీ ఉందని ఈ ప్రాంతంలో పైనాపిల్ దిగుబడి అధికంగా ఉన్నందున పార్కు ఏర్పాటుకు ఎంతో అనుకూలంగా ఉంటుందని సూచించారు. యూనిట్ స్థాపనకు అవసరమైన శిక్షణను నిపుణులతో ఇప్పిస్తామని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.