'ప్రాజెక్టులకు నిధులు రాబట్టడంలో పాలకులు వైఫల్యం'
కర్నూలు: రాష్ట్ర బడ్జెట్ లో కర్నూలు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు రాబట్టడంలో పాలకులు వైఫల్యం చెందారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్పలు విమర్శించారు. బుధవారం కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించి జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించే జిల్లా ప్రజాప్రతినిధులు గళం విప్పాలని వారు డిమాండ్ చేశారు.