గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన

గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన

ASR: గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన ఉండాలని మంప ఎస్సై కే.శంకరరావు విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఆయన కొయ్యూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్‌ను సందర్శించారు. 10, ఇంటర్ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థి దశనుండే చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. ఎవరైనా ఈవ్ టీజింగ్‌కు పాల్పడినా, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.