ఆలయ అభివృద్ధి కోసం రూ.35 వేల రూపాయల విరాళం

ఆలయ అభివృద్ధి కోసం రూ.35 వేల రూపాయల విరాళం

NDL: నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం నంద్యాల పట్టణానికి చెందిన గంగిశెట్టి తిమ్మయ్య కుటుంబ సభ్యులు రూ.35వేల రూపాయల విరాళాన్ని ఆలయ అధికారులకు బుధవారం నాడు అందజేశారు. అనంతరం గంగిశెట్టి తిమ్మయ్య కుటుంబ సభ్యులు చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు.