ఆర్టీసీ సిబ్బందిని సన్మానించిన డిపో మేనేజర్

ఆర్టీసీ సిబ్బందిని సన్మానించిన డిపో మేనేజర్

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని RTC డిపోలో విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి, డిపో ఆదాయ వృద్ధికి ఎంతో సహకరించిన ఉద్యోగులను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ శనివారం ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఆమె మాట్లాడుతూ.. సంస్థ పురోగతికి ఉద్యోగుల సమిష్టి కృషే మూలస్తంభమని, సత్కరించబడిన ఉద్యోగులు తోటి సిబ్బందికి ఆదర్శంగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.