'అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా'

ప్రకాశం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం ఆడడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొమరోలు ఎస్సై నాగరాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానంతో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరంగా నిఘా ఉంచడం జరుగుతుందన్నారు. అనంతరం స్థానిక ప్రజలకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.