కొండా లక్ష్మణ్ బాపూజీకి మేయర్ నివాళి

కొండా లక్ష్మణ్ బాపూజీకి మేయర్ నివాళి

WGL: 42% బీసీ రిజర్వేషన్ల సాధనకై తన వంతుగా మద్దతు తెలుపుతున్నామని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో WGL గోపాలస్వామి గుడి ప్రాంతంలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీసీ నాయకులతో కలిసి బీసీల ఐక్యతపై నినాదాలు చేశారు.