బీమా సౌకర్యం.. వారికి మాత్రమే..!

NLR: జిల్లాలో 4.82లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారని, జాబ్ కార్డు ఉన్నవారికి బీమా సౌకర్యం కల్పించనున్నట్లు డ్వామా పీడీ గంగాభవాని పేర్కొన్నారు. రాపూరు, పాదలకూరు, సైదాపురం కలువాయి మండలాల ఉపాధి సిబ్బందికి ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సౌకర్యం ఉంటుందన్నారు.