ఘనంగా గురురాజు హోమియోపతి వార్షికోత్సవం
కృష్ణా: గుడివాడ ఏలూరు రోడ్డులోని గురురాజు హోమియోపతి కళాశాల 80వ వార్షికోత్సవ వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. హోమియోపతి కళాశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు. పనిలేని వైద్యానికి చిరునామా హోమియోపతి అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి పాల్గొన్నారు.