కథలాపూర్‌లో మెడికల్ క్యాంపు
JGL: కథలాపూర్ మండల కేంద్రంలోని తుర్కకాశి వాడలో ఇవాళ పద్మపాణి పద్మపాని సొసైటీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ప్రజలకు హెచ్ఐవీ, ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగించారు. ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత గూర్చి వివరించారు. 50 మందికి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు జరిపి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింధూజ,శేఖర్,సుదర్శన్, ప్రసాద్ పాల్గొన్నారు.