పాక్షిక చంద్రగ్రహణం.. కాణిపాకం ఆలయం క్లోజ్
CTR: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 6:20 గంటల నుంచి సర్వదర్శనం నిలిపివేశారు. గ్రహణం సాయంత్రం 6:47కు ముగిసిన తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, రేపు ఉదయం నుంచి దర్శనం యథావిధిగా ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.