VIDEO: వర్ధన్నపేటలో బంగ్లాదేశ్ హింసాకాండపై నిరసన
WGL: బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న హింసను ఖండిస్తూ ఇవాళ వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. అంబేద్కర్ కూడలి వద్ద కార్యకర్తలు “బంగ్లాదేశ్ డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు. దాడుల్లో మృతులైన హిందువుల ఆత్మశాంతికి కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన నిర్వహించారు.