అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
కృష్ణా: జిల్లాలో ఖాళీగా ఉన్న 17 అంగన్వాడీ కార్యకర్త, 82 సహాయకురాల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఐసీడీఎస్ పీడీ రాణి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 3వ తేదీలోపు సంబంధిత సీడీపీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులై, 21-35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించారు.