ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర

SRD: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో శనగలకు మద్దతు ధర లభిస్తుందని ఆత్మ కమిటీ ఛైర్మన్ రామలింగారెడ్డి అన్నారు. జహీరాబాద్‌‌లో జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. మద్దతు ధర కోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే రైతులు విక్రయించాలని కోరారు. క్వింటాకు మద్దతు ధర రూ.5875 చెల్లిస్తునట్లు తెలిపారు.