మాజీ మంత్రి విడదల రజిని పీఏలపై కేసు నమోదు

మాజీ మంత్రి విడదల రజిని పీఏలపై కేసు నమోదు

GNTR: వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని పీఏలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వివరాల మేరకు.. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాల పేరుతో పలువురి దగ్గర డబ్బులు వసూలు చేశారంటూ రజిని పీఏలై ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆమె పీఏలైనా శ్రీగణేష్, కుమారస్వామి, రామకృష్ణ, శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.