నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: కురిచేడు మండలంలో సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ ఏఈ అంకబాబు తెలిపారు. కురిచేడు విద్యుత్ లైన్లలో మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 8గంటల నుంచి 2గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.