‘ఇందిరమ్మ ఇళ్లు రాలేదని' సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

‘ఇందిరమ్మ ఇళ్లు రాలేదని' సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

WGL: జిల్లా చౌరస్తాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని మనోవేదనతో కొమ్ముల సుభాష్ అనే వ్యక్తి సోమవారం రాత్రి సెల్ టవర్ ఎక్కాడు. అటుగా వెళ్తున్న ట్రాఫిక్ సీఐ సుజాత అతడిని గమనించి, పోలీసుల సాయంతో కిందికి దించే ప్రయత్నం చేశారు. సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో సుభాష్ కిందకు దిగివచ్చాడు.