యాదాద్రిని దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ

యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని శుక్రవారం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా వారికి ఆలయం మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. వీరితోపాటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.