రిచా ఘోష్‌కు డీఎస్పీ పదవి
వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టులో వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నజరానాలు ప్రకటించింది. రిచాను సన్మానించి ఆమెకు రాష్ట్ర అత్యుత్తమ పౌర అవార్డు 'బంగ భూషణ్'ను సీఎం మమతా బెనర్జీ అందజేశారు. అలాగే, ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు. ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉన్న తొలి బెంగాల్ క్రికెటర్ రిచానే కావడం గమనార్హం.