ప్ర‌ధానికి మ‌త్స్య‌కార నేత లేఖ‌

ప్ర‌ధానికి మ‌త్స్య‌కార నేత లేఖ‌

VSP: కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన తీరప్రాంత రాష్ట్రాల్లో రేర్ఎర్త్ మినరల్ కారిడార్ల నిర్ణయాన్ని రద్దు చేయాలని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ ప్రధాని నరేంద్ర మోదీకి శుక్ర‌వారం లేఖ రాశారు. ఈ మైనింగ్ విధానం వల్ల తీరప్రాంత గ్రామాలు, మత్స్యకారుల జీవనోపాధి, సముద్ర పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు.