రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
శ్రీకాకుళం జిల్లా సోంపేట - జాదు పూడి రైల్వే స్టేషన్ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు GRP హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు బుధవారం పేర్కొన్నారు. మృతుని వయసు సుమారు 60 సంవత్సరాల ఉంటుందన్నారు. వివరాలు తెలిసినవారు 9440 627 567 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.