నకిలీ గోల్డ్ విక్రయించే యువకుడు అరెస్ట్
BDK: ఇల్లందు నియోజకవర్గ కారేపల్లి మండల పరిధిలోని ఓ తండాకు చెందిన యువకుడిని కొత్తగూడెం పోలీసులు ఇవాళ అదుపులో తీసుకున్నారు. నకిలీ గోల్డ్ విక్రయించే ముఠా సభ్యులతో సంబంధాలు పెట్టుకుని, బ్యాంకులలో తాకట్టు పెట్టి డబ్బులు పోగు చేసుకోవడం అలవాటుగా మారిన ఈ యువకుడు కొత్తగూడెం పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.