రామాలయంలో మంచినీరు లేక భక్తుల ఇక్కట్లు

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో మంగళవారం తాగునీరు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దేవస్థానం ప్రసాదం తిన్న భక్తులు నీళ్లు తాగడానికి, చేతులు కడుక్కోవడానికి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలు, వాటర్ కూలర్లు ఖాళీగా దర్శనమియ్యడంతో భక్తులు చేసేదేమీ లేక దుకాణాల్ల నీళ్లు కోనుగోలు దాహార్తి తీర్చుకున్నారు.