ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నాం

KMM: డీఎం ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన ఆరోగ్యం బాగోలేకపోయిన ఓవర్ డ్యూటీ వేస్తూ మణుగూరు DM ఇబ్బందులకు గురి చేస్తున్నారని డ్రైవర్ సైదులు ఆర్ఎంకు ఫిర్యాదు చేశాడు. దీంతో సైదులుకు కండక్టర్ సర్వీస్ ఇవ్వాలని ఆర్ఎం డీఎంను ఆదేశించారు. మనస్థాపానికి గురైన సైదులు ఎలుకల మందు తాగేందుకు ప్రయత్నించగా సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలించారు.