హెల్త్ యూనిట్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
NTR: కంచికచర్లలో ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరిచే దిశగా శుక్రవారం ఒక ముఖ్యమైన అడుగు పడింది. 15వ ఫైనాన్స్ నిధుల ద్వారా రూ. 62 లక్షల వ్యయంతో నిర్మించబోతున్న హెల్త్ యూనిట్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్ నిర్మాణం పూర్తయితే గ్రామాలు, మండల పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆమె పేర్కొన్నారు.